పర్యాటకులకు శుభవార్త.. నవంబర్ లో ప్రారంభం కానున్న ‘శ్రీరామాయణ ఎక్స్ ప్రెస్’!
- రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాల ద్వారా పర్యటన
- నవంబర్ 14న ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ఎక్స్ ప్రెస్
- రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన
యూపీలోని అయోధ్యలో ఈ రైలు తొలిస్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి నందిగ్రామ్, సీతామర్హి, వారణాసి, ప్రయాగ, శ్రీనగవేర్పూర్, చిత్రకూట్, హంపి, నాసిక్ మీదుగా రామేశ్వరం చేరుతుంది. శ్రీలంక దేశంలోని కొన్ని ప్రాంతాల గురించి కూడా రామాయణంలో ప్రస్తావనకు వస్తుంది. ఈ టూర్ లో భాగంగా శ్రీలంకలోని క్యాండీ, నువారా ఎలియా, కొలంబో, నెగోంబోల దర్శనాన్ని కూడా చేర్చారు. అయితే, ఇందుకు ప్రత్యేక ఛార్జీలను రైల్వే శాఖ వసూలు చేస్తుంది. శ్రీలంకలోని ఆయా ప్రాంతాలను కూడా సందర్శించాలనుకునే పర్యాటకులు చెన్నై నుంచి కొలంబోకు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది.