కష్టకాలంలో మనిషి ఏదైనా చేయగలడు: సొనాలి బింద్రే భావోద్వేగపూరిత పోస్ట్
- హై గ్రేడ్ కేన్సర్‌తో బాధపడుతోన్న సొనాలి
- మనలో శక్తి దాగి ఉంది
- దాన్ని బలవంతంగా బయటకు తీసుకొచ్చే వరకు తెలియదు
- కష్టాలను తట్టుకొని మనుగడ సాగించగలిగే సామర్థ్యం మన సొంతం
తన అభిమాన రచయిత ఇసబెల్ అలెండె ఓ విషయాన్ని రాశారని, మనలో దాగి ఉన్న శక్తిని మనం బలవంతంగా బయటకు తీసుకొచ్చే వరకు మనం ఎంత శక్తిమంతులమో మనకు తెలియదని పేర్కొంది. కష్టకాలంలో మనిషి ఏదైనా చేయగలడని, కష్టాలను తట్టుకొని మనుగడ సాగించగలిగే అద్భుతమైన సామర్థ్యం మనిషి సొంతమని చెప్పింది. తనకు కేన్సర్ అని తెలిసినప్పటి నుంచి బంధువులు, స్నేహితులు అండగా నిలుస్తున్నారని, తనపై ఎనలేని ఆదరాభిమానాలు చూపిస్తున్నారని పేర్కొంది.