vujay: దర్శకుడు విజయ్ రెండో పెళ్లి వార్తలు .. అమలా పాల్ మనస్తాపం!

  • అమలా పాల్ కి విడాకులు 
  • విజయ్ రెండో పెళ్లి అంటూ వార్తలు 
  • పత్రికలపై ఆయన అసహనం  
దర్శకుడు ఏఎల్ విజయ్ .. అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం .. ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోవడం తెలిసిందే. కోర్టులో విడాకుల కేసు నడుస్తుండగానే ఏఎల్ విజయ్ కి ఆయన తండ్రి మరో సంబంధాన్ని  వెతికి పెట్టినట్టుగా కొంతకాలంగా వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. రెండు వారాల క్రిందటే ఏఎల్ విజయ్ కి .. అమలాపాల్ కి చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దాంతో త్వరలోనే విజయ్ పెళ్లి జరగనుందనీ .. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు తాజాగా కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.

విజయ్ రెండో పెళ్లి గురించి తెలుసుకున్న అమలా పాల్ మనస్తాపానికి లోనైందనీ .. ఒక షూటింగ్ నుంచి ఆమె హఠాత్తుగా వెళ్లిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఆమె ఇంకా విజయ్ గురించి ఆలోచిస్తోందంటూ పత్రికలు రాసుకొచ్చాయి. దాంతో విజయ్ స్పందిస్తూ తన రెండో పెళ్లి విషయంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. పత్రికలు తన రెండో పెళ్లి గురించి రాసేముందు తనని ఒక మాట కనుక్కుని వుంటే బాగుండేదంటూ అసహనాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుతం తన దృష్టి కెరియర్ పై మాత్రమే ఉందంటూ స్పష్టం చేశాడు.     
vujay
mala paul

More Telugu News