harman preet singh: డీఎస్పీ పదవిని కోల్పోయిన భారత స్టార్ మహిళా క్రికెటర్

  • హర్మన్ ప్రీత్ డిగ్రీ పట్టా నకిలీది
  • ఆమె విద్యార్హతలకు కానిస్టేబుల్ ఉద్యోగం మాత్రమే వస్తుందన్న పోలీసు శాఖ
  • ఉద్యోగం నుంచి తొలగించిన పంజాబ్ ప్రభుత్వం
భారత మహిళా స్టార్ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ డీఎస్పీ పదవిని కోల్పోయింది. ఆమె డిగ్రీ పట్టా నకిలీదని తేలడంతో... పంజాబ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పూర్తి చేసిన హర్మన్ ప్రీత్ కు కేవలం కానిస్టేబుల్ ఉద్యోగం మాత్రమే వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇదే డిగ్రీ పట్టా ఆధారంగా... గతంలో ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం చేసిన హర్మన్ ప్రీత్... ఇంత వరకు ఈ అంశంపై స్పందించలేదు.

హర్మన్ ప్రీత్ ఫేక్ సర్టిఫికెట్ వివరాలను ఇటీవలే పోలీసు శాఖ సీఎం కార్యాలయానికి అందజేసింది. డీఎస్పీ ఉద్యోగానికి సరిపడా విద్యార్హతలు ఆమెకు లేవని తన నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో, డీఎస్పీగా కొనసాగేందుకు కుదరదని సీఎంకు ప్రతిపాదించింది. దీంతో, ఆమె డీఎస్పీ ఉద్యోగం కోల్పోయింది.
harman preet singh
cricketer
dsp

More Telugu News