టీడీపీ తరఫున కర్నూలు నుంచి పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వెల్లడించిన నారా లోకేష్!
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభర్థుల పేర్లను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా మోహన్ రెడ్డిల పేర్లను ప్రకటించారు. కర్నూలు పర్యటన సందర్భంగా లోకేష్ వీరి పేర్లను వెల్లడించి సంచలనం రేపారు. వీరిద్దరినీ భారీ మెజార్టీతో గెలపించాలని ఓటర్లను కోరారు.
ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, కేంద్ర ప్రభుత్వానికి కన్ను కుట్టిందని చెప్పారు. ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ మోదీని అడిగేందుకు జగన్, పవన్ కల్యాణ్ ఇద్దరూ భయపడుతున్నారని తెలిపారు. చంద్రబాబును పదేపదే విమర్శిస్తున్న వీరిద్దరూ... మోదీని మాత్రం ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, పవన్ కల్యాణ్ పార్టీ అని అర్థం చెప్పారు. తనపై చేస్తున్న విమర్శలకు ఏవైనా ఆధారాలుంటే జగన్, పవన్ లు ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు.