Jagan: జగన్ అధికారంలోకొస్తే దోచేస్తాడన్న టీడీపీ నేతలు ఇప్పుడు అదేపని చేస్తున్నారు : పవన్ కల్యాణ్ ఫైర్

  • కూలీ కొడుకు కూలీగానే ఉండిపోవాలి
  • సీఎం కొడుకులు మాత్రం సీఎం అయి మన నెత్తిపై ఎక్కి తొక్కాలి!
  • మీకు ఓట్లు వేసేది ఎక్కి తొక్కించుకోవడానికా?
టీడీపీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. విశాఖపట్టణంలో ‘జనసేన’ నిరసన కవాతు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు.. ఇంజనీర్ కొడుకు ఇంజనీరవుతాడు.. రైతు కొడుకు రైతవుతాడు..కూలీ కొడుకు కూలీ అవుతాడు.. సీఎం కొడుకు సీఎం అవుతాడు. కూలీ కొడుకు కూలీగానే ఉండిపోవాలి. కానీ, సీఎం కొడుకులు మాత్రం సీఎం అయి.. మన నెత్తి మీద ఎక్కి తొక్కాలి.. మేమందరం ఊడిగం చేసేది.. మీకు ఓట్లు వేసేది ఎక్కి తొక్కించుకోవడానికా?’ అంటూ పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.‘అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే దోపిడీ చేసేస్తాడని అంటున్నారు! మరి, మీరు వైజాగ్ లో చేసిందేమిటి? లక్ష ఎకరాలను ఏం చేశారు? అడ్డగోలుగా దోచి పారేశారు’ అంటూ టీడీపీపై పవన్ నిప్పులు చెరిగారు.
Jagan
pawan
Telugudesam

More Telugu News