singapure: సింగపూర్ లో చంద్రబాబుకు ఘనస్వాగతం

  • ప్రపంచ నగరాల సదస్సు నిమిత్తం సింగపూర్ వెళ్లిన బాబు
  • తెలుగు అసోసియేషన్ ప్రతినిధుల ఘన స్వాగతం 
  • కొన్ని ముఖ్యమైన సమావేశాలు, చర్చల్లో పాల్గొననున్న బాబు
ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనే నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు అక్కడి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

ఈ సదస్సులో భాగంగా పట్టణ, నగరీకరణకు సంబంధించిన అంశాలపై ప్రసంగించనున్నారు. కొన్ని ముఖ్యమైన సమావేశాలు, చర్చల్లో కూడా ఆయన పాల్గొననున్నారు. పలు దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతోనూ బాబు భేటీ కానున్నారు. కాగా, మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీఆర్డీయే, సీఎం కార్యాలయ అధికారులు వెళ్లారు.
singapure
Chandrababu

More Telugu News