Vijayawada: విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ

  • విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా సవాంగ్ బదిలీ
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు
  • రెండున్నరేళ్లకు పైగా విజయవాడ సీపీగా చేసిన సవాంగ్
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా ఆయన్ని బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెండున్నరేళ్లకు పైగా విజయవాడలో సీపీగా ఆయన విధులు నిర్వహించారు. ఏపీ డీజీపీగా సవాంగ్ ను నియమిస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, సీనియారిటీ క్రమంలో ఆర్పీ ఠాకూర్ ను డీజీపీగా ఏపీ ప్రభుత్వం నియమించడం తెలిసిందే.
Vijayawada
gowtham sawang

More Telugu News