తమ సంస్థ డీన్ వాసుబాబుపై సస్పెన్షన్ వేటు వేసిన శ్రీ చైతన్య
- ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసు
- నిన్న వాసుబాబు అరెస్ట్
- తమకు ఎటువంటి సంబంధమూ లేదన్న శ్రీ చైతన్య
ఈ విషయంపై స్పందించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల తెలంగాణ కో ఆర్డినేటర్ నరేంద్ర బాబు... శ్రీచైతన్య డీన్ వాసుబాబును అరెస్టు చేయడం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయనను సస్పెండ్ చేశామని అన్నారు. 32 ఏళ్ల తమ విద్యా సంస్థ ప్రస్థానంలో తామెన్నడూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని చెప్పారు. తాజాగా జరిగిన ఈ పరిణామంతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు.