Rahul Gandhi: రాహుల్ గాంధీ డ్రగ్స్ తీసుకుంటారు: సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు

  • రాహుల్ కొకైన్ తీసుకుంటారు
  • ఆయనకు డోప్ టెస్ట్ నిర్వహించండి.. నిజం తెలుస్తుంది
  • డోప్ టెస్టులో కచ్చితంగా ఆయన విఫలమవుతారు
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ కొకైన్ తీసుకుంటారని ఆయన ఆరోపించారు. పంజాబ్ లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వోద్యోగులందరికీ డోప్ టెస్ట్ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దీనిపై స్వామి స్పందిస్తూ, పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందు రాహుల్ గాంధీకి డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాహుల్ కొకైన్ తీసుకుంటారు కాబట్టి... డోప్ టెస్టులో కచ్చితంగా ఆయన విఫలమవుతారని చెప్పారు. మరోపక్క, పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ స్పందిస్తూ, పంజాబ్ లో డ్రగ్స్ తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని... ఆ పార్టీలోనే ఎక్కువ మంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారని... ముందు వారికి డోపింగ్ టెస్టులు నిర్వహించాలని ఎద్దేవా చేశారు. 
Rahul Gandhi
drugs
subrahmanian swamy

More Telugu News