BJP: అసెంబ్లీకి రారు, పార్లమెంట్ కు వెళ్లరు... వీరు మనకెందుకు: వైసీపీ నేతలపై దేవినేని ఉమ విమర్శలు

  • రాష్ట్ర ప్రయోజనాలు వీరికి అవసరం లేదు
  • కాంగ్రెస్ నేతలే బీజేపీ, వైసీపీ, జనసేన నేతలవుతున్నారు
  • అందరూ తోడు దొంగలేనన్న దేవినేని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, ఎంపీలు పార్లమెంట్ కు పోరని, రాష్ట్ర ప్రయోజనాలు పట్టని వీరి అవసరం ప్రజలకు లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రాన్ని విభజించిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతలే బీజేపీ, వైసీపీ నేతలుగా, ఆపై జనసేన నేతలుగా రూపాంతరం చెందుతున్నారని, ఈ మూడు పార్టీలూ తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించిన దేవినేని, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావులు పదేళ్ల పాటు మంత్రులుగా ఉండి రాష్ట్ర ప్రజలకు ఏమీ చెయ్యలేదని నిప్పులు చెరిగారు.
BJP
YSRCP
Jana Sena
Devineni Uma
Jagan

More Telugu News