vijay Mallya: విజయ్ మాల్యాకు దిమ్మదిరిగే షాకిచ్చిన లండన్ కోర్టు.. భారత బ్యాంకులకు గొప్ప విజయం!

  • మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చన్న కోర్టు
  • ఆయన భవనాలు, ఆస్తులపై నియంత్రణకు బ్యాంకులకు అధికారం
  • అవసరమైతే పోలీస్ ఫోర్సు ఉపయోగించుకోవచ్చని సూచన
లిక్కర్ కింగ్ గా వెలుగొందిన విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు పోరాడుతున్న 13 బ్యాంకుల కన్సార్టియంకు గొప్ప విజయం లభించింది. లండన్‌లోని విజయ్ మాల్యా ఆస్తులను సీజ్ చేసేందుకు లండన్ ‌కోర్టు అనుమతించింది. లండన్ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఉన్న విజయ్ మాల్యా ప్రాపర్టీల్లోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రవేశించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, లేడీవాక్, టెవిన్‌లోని బ్రాంబెల్ లాడ్జ్, వెల్విన్‌లలోకి కూడా అధికారులు ప్రవేశించవచ్చని తేల్చి చెప్పింది. ప్రస్తుతం మాల్యా ఇక్కడే ఉంటున్నారు.
 
ఈ ఆదేశాలను ఉపయోగించుకుని 1.145 బిలియన్ పౌండ్ల విలువైన నిధులను రికర్ చేసుకోవాలని బ్యాంకులకు తెలిపింది. ‘‘హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, ఎవరైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్ నేతృత్వంలో విజయ్ మాల్యా భవంతుల్లోకి ప్రవేశించవచ్చు. ఆయన ఆస్తులను తమ నియంత్రణలోకి తీసుకోవచ్చు’’ అని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.‌ అవసరమైతే పోలీసు ఫోర్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. అలాగే, పీఎంఎల్ఏ కోర్టులో మాల్యా హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.

 లండన్ కోర్టు తీర్పు తమకు గొప్ప విజయమని బ్యాంకుల కన్సార్టియం పేర్కొంది. భారత్‌లోని 13 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర ఎగ్గొట్టిన విజయ్ మాల్యా మార్చి 2, 2016లో లండన్ పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
vijay Mallya
King fisher
Bank
London
Court

More Telugu News