ఒకరితో సహజీవనం చేస్తూ.. మరొకరిని పెళ్లాడిన ప్రబుద్ధుడికి అరదండాలు
- నాలుగేళ్ల సహజీవనం తర్వాత మరో యువతితో వివాహం
- పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు
- అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్ సైదప్ప బస్తీలో నివసించే యువతి(23)కి స్థానికంగా ఉండే సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమకు దారి తీసింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, తాజాగా, సత్యనారాయణ మరో యువతిని పెళ్లాడాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు.