vijay kanth: చికిత్స కోసం అమెరికా వెళుతున్నా: విజయ్‌కాంత్‌ ట్వీట్‌

  • మరోసారి అనారోగ్యానికి గురైన విజయ్‌కాంత్‌
  • ఈ నెల 7వ తేదీన అమెరికాకు
  • గతంలో పలుసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న డీఎండీకే నేత
తాను చికిత్స కోసం అమెరికా వెళుతున్నానని తమిళనాడులోని డీఎండీకే నేత కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ నెల 7వ తేదీన తాను బయలుదేరతానని అయితే, తనకు వీడ్కోలు చెప్పేందుకు అభిమానులు విమానాశ్రయం వద్దకు రావద్దని ఆయన కోరారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన తమ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన గతంలో పలుసార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆయనను పలు ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.
vijay kanth
america
Tamilnadu

More Telugu News