Chandrababu: ఏపీ అధోగతికి ఇంటిదొంగ చంద్రబాబే కారణం: అంబటి రాంబాబు

  • రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఈరోజే తెలిసిందా?
  • ‘హోదా’ మా హక్కు అన్న వైసీపీ నేతలను అవహేళన చేశారు
  • చంద్రబాబును ప్రజలు క్షమించరు
ఏపీకి బీజేపీ, టీడీపీ వెన్నుపోటు పొడిచాయని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘విభజన హామీలు నెరవేరకపోవడానికి కారణం మీరు కాదా? రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఈరోజే తెలిసిందా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చంద్రబాబు అనలేదా? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతామన్నారు. ‘హోదా’ మా హక్కు అన్న వైసీపీ నేతలను అవహేళన చేశారు. ప్రత్యేక హోదాను పాతరేయడానికి ప్రయత్నించిన చంద్రబాబును ప్రజలు క్షమించరు. ఏపీ అధోగతికి ఇంటిదొంగ చంద్రబాబే కారణం. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటి? ఫ్లై ఓవర్ కట్టలేని చంద్రబాబు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? మాపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదు’ అని అంబటి అన్నారు.
Chandrababu
ambati

More Telugu News