శత్రువుతో జగన్, పవన్ ఎందుకు యుద్ధం చేయడం లేదు?: శైలజానాథ్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. ఏపీని బీజేపీ దారుణంగా వంచించిందని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఇంత అన్యాయం చేస్తున్నా వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. రాష్ట్రానికి శత్రువు ఎవరో తెలిసినా... యుద్ధం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ పార్టీనే అని... ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. 


More Telugu News