అవన్నీ అవాస్తవాలు.. నేను ఇండియాకి రావడం లేదు: వివాదాస్పద ముస్లిం మత బోధకుడు జకీర్ నాయక్
- మలేషియాలో తలదాచుకున్న జకీర్ నాయక్
- ఇండియాకు తిరిగి వస్తున్నాడంటూ వార్తలు
- భారత్ లో రక్షణ ఉంటుందనే భావన కలిగినప్పుడే వస్తా
తాజాగా, మలేసియా నుంచి జకీర్ ఇండియాకు బయల్దేరుతున్నాడంటూ మలేషియా ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి నుంచి సమాచారం అందింది. దీనిపై జకీర్ స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. తన పట్ల భారత ప్రభుత్వం న్యాయంగా వ్యవహరిస్తుందన్న భరోసా కలిగినప్పుడు, తనకు రక్షణ ఉంటుందన్న భావన కలిగినప్పుడు మాత్రమే... స్వదేశానికి వస్తానని చెప్పారు.
జకీర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, జకీర్ ను మలేషియా ప్రభుత్వం భారత్ వెళ్లిపొమ్మని చెప్పలేదని తెలిపారు. జకీర్ కు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పారు. మలేషియా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కేంద్ర హోంశాఖ కూడా తెలిపింది. టెర్రరిస్టులకు అనుకూలంగా ఉన్న జకీర్ నాయక్ ను అప్పగించాలంటూ మలేషియాను భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే.