కోహ్లీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు!
- అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ
- తొలి భారతీయుడిగా, తొలి క్రికెటర్‌గా ఘనత
- బ్రెండన్ మెకల్లమ్ రికార్డు బద్దలు
దీంతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. మెకల్లమ్ 66 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, కోహ్లీ అతడి కంటే పది మ్యాచ్‌ల ముందే.. అంటే 56వ ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డును అందుకున్నాడు. కాగా, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కివీస్‌కే చెందిన మార్టిన్ గప్టిల్ 2,271 పరుగులతో అందరికంటే ముందున్నాడు.