రజనీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కుర్రాడు!
- రజనీతో కార్తీక్ సుబ్బరాజ్ మూవీ
- కొనసాగుతోన్న షూటింగ్
- హైలైట్ గా నిలవనున్న సంగీతం
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. బాబీ సింహా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రకోసం తాజాగా 'దీపక్ పరమేశ్'ను తీసుకున్నారు. ఇంతకుముందు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన 'మెర్క్యురీ' సినిమాతో దీపక్ మంచి మార్కులు కొట్టేశాడు. అందువలన రజనీ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం ఆయనను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి అనిరుథ్ సంగీతం హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.