ఇన్నాళ్లకు 'హాల్' లోకి 'వాల్' వచ్చింది: సచిన్ ఫన్నీ ట్వీట్!
- మేటి క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్
- ఇటీవలే 'హాల్ ఆఫ్ ఫేమ్' లోకి
- అభినందనలు తెలిపిన సచిన్ టెండూల్కర్
తనతో కలసి ఎన్నో సంవత్సరాల పాటు జట్టుకు సేవలందించిన రాహుల్ ను అభినందిస్తూ, "ద్రావిడ్ కు శుభాకాంక్షలు.. ఎట్టకేలకు 'హాల్'లో 'వాల్'కు చోటు లభించింది. ఈ గౌరవానికి రాహుల్ పూర్తిగా అర్హుడు" అని వ్యాఖ్యానించారు. ఈ 'హాల్ - వాల్' ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ వైపు వరుసగా ఎన్ని వికెట్లు పడిపోతున్నా, మరోవైపు గోడ మాదిరి నిలబడి, అవుట్ కాకుండా ఆడే ద్రావిడ్ ను 'ది వాల్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే.