ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బ్రెజిల్
- ఫిఫా ప్రపంచకప్‌లో మొత్తం 228 గోల్స్ సాధించిన బ్రెజిల్
- జర్మనీ రికార్డు బద్దలు
- ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచకప్ గెలుచుకున్న బ్రెజిల్
బ్రెజిల్ ఆడిన 108 మ్యాచుల్లో 73 మ్యాచుల్లో విజయం సాధించింది. 17 మ్యాచులు ఓడింది. 18 మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఫిఫా ప్రపంచకప్‌ను ఐదు సార్లు గెలుచుకున్న ఒకే ఒక జట్టు గానూ బ్రెజిల్ రికార్డు సృష్టించింది. కాగా, ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ సాధించిన మూడో జట్టుగా ఇటలీ నిలిచింది. 83 మ్యాచులు ఆడిన ఇటలీ 128 గోల్స్‌తో తృతీయ స్థానంలో ఉంది.