ఈ నెల 8 నుంచి భారత్‌లో ద.కొరియా అధ్యక్షుడి పర్యటన
- భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రాక
- ఈ నెల 11 వరకు భారత్‌లో పర్యటన
- ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై చర్చలు
భారత పర్యటనలో ఆయన.. మోదీతో సమావేశం అవుతారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం, కొరియా ద్వీపంలో శాంతి, సుసంపన్నతలపై చర్చలు జరుగుతాయి. అలాగే ఆసియా దేశాలతో పరస్పర సహాయ సహకారాలపై కూడా చర్చిస్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కూడా మూన్ జే ఇన్ కలవనున్నారు.