పౌరీగల్వార్ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మోదీ
- ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
- లోయలో పడ్డ బస్సు.. 47కి పెరిగిన మృతుల సంఖ్య
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మోదీ
సుమారు 55 మంది ప్రయాణికులతో రామ్ నగర్ నుంచి భోహన్ కు బస్సు బయల్దేరింది. బయల్దేరిన కొద్ది సేపటికే బస్సు లోయలో పడిపోయింది. ఘటనా స్థలిని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు.