Nara Lokesh: పవర్‌ స్టార్‌ పవర్‌ ఫుల్‌గా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారనుకున్నాం: నారా లోకేశ్‌

  • మా తాత, నాన్నకు చెడ్డపేరు తెచ్చే పని చేయను
  • కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా చంద్రబాబుని విమర్శిస్తున్నారు
  • జగన్‌, పవన్‌లకి దమ్ముంటే కేంద్రంపై పోరాడాలి
తన తాత ఎన్టీఆర్‌, నాన్న చంద్రబాబుకు చెడ్డపేరు తెచ్చే పని చేయనని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తనపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో దళిత తేజం-టీడీపీ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... "మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ వయసులోనూ చంద్రబాబు కష్టపడుతున్నారు.. నేను కూడా చంద్రబాబు వేగాన్ని అందుకోలేకపోతున్నాను.

మచ్చలేని మన చంద్రన్నపై కొందరు విమర్శలు చేస్తున్నారు. పవర్‌ స్టార్‌ పవర్‌ ఫుల్‌గా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారనుకున్నాం. కానీ, చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు. ఓ వైపు జగన్‌, మరోవైపు పవన్‌లకు దమ్ముంటే కేంద్ర సర్కారుపై పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టాలి" అని అన్నారు. ఎన్నికల వేడి ప్రారంభమైందని, బీజేపీ నేతలు మనముందుకు వస్తారని, బీజేపీలో బీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్‌ పార్టీ, పీ అంటే పవన్‌ పార్టీ అని అన్నారు. చివరకు 'జై భీమ్‌' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. 
Nara Lokesh
Andhra Pradesh
Pawan Kalyan
Jagan

More Telugu News