mumbai: ముంబై విమాన ప్రమాదంలో చనిపోయిన వారికి పోస్ట్ మార్టం.. నివేదికలో ఏముందంటే..!

  • షాక్ తో ప్రాణాలు విడిచారంటూ రిపోర్ట్
  • శరీరానికి అంటుకున్న మంటలు, గాయాలతో భయాందోళనలకు గురైన మృతులు
  • ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయిన విమానం
ముంబైలో చార్టెడ్ ఫ్లైట్ కూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. వీరిలో పైలట్ ప్రదీప్ రాజ్ పుత్, కోపైలట్ మరియా, ఇంజినీర్ సురభి గుప్తా, మరో టెక్నీషియన్ ఉన్నారు. వీరితో పాటు గ్రౌండ్ మీద ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరి మృత దేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. శరీరానికి అంటుకున్న మంటలు, గాయాలతో షాక్ తో వీరు ప్రాణాలు కోల్పోయారని పోస్ట్ మార్టంలో తేలింది. విమానం ల్యాండ్ అవబోతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.
mumbai
plane crash
post mortem
report

More Telugu News