veerappa: నరేంద్ర మోదీ పులయితే అడవులకి వెళ్లాలి: వీరప్ప మొయిలి

  • ప్రతిపక్ష నేతలు కాకులు, కోతులంటూ హెగ్డే వ్యాఖ్యలు
  • మండిపడుతోన్న కాంగ్రెస్‌ నేతలు
  • పులి క్రూరంగా తయారైందని చురక
కాకులు, కోతులు, నక్కలు, ఇతర జంతువులన్నీ కలసి ఒక్కటిగా వస్తున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తమకు పులి (మోదీ) ఉందని, 2019లో పులినే ఎన్నుకోవాలని ఆయన అన్నారు. హెగ్డే వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలి తాజాగా మీడియాతో మాట్లాడుతూ... 'పులి క్రూరంగా తయారైంది.. దాన్ని తిరిగి అడవులకి పంపాలి' అని చురకలంటించారు.

కాగా, అనంతకుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తోన్న ప్రతిపక్ష పార్టీలపై ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారు కేంద్ర మంత్రివర్గంలో ఉండకూడదని, ఆయనపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
veerappa
Congress
Narendra Modi

More Telugu News