CM Ramesh: ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు చెబుతుంటే భయం వేస్తోంది: సీఎం రమేష్‌ భార్య శ్రీదేవి

  • తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సీఎం రమేష్‌ భార్య
  • తన భర్త పట్టుదల రోజు రోజుకు గట్టిపడుతుందని వ్యాఖ్య
  • ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదన్న శ్రీదేవి
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ చేస్తోన్న ఆమరణ నిరాహార దీక్ష 10వ రోజు కొనసాగుతోంది. ఆయనకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ ఫోన్‌ చేసి విరమించాల్సిందిగా కోరినప్పటికీ ఉక్కు కర్మాగారంపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు తాను దీక్షను విరమించబోనని ఆయన చెప్పారు. మరోపక్క, సీఎం రమేష్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్యులు చెబుతున్నారు.

తాజాగా సీఎం రమేష్‌ భార్య శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పరిస్థితి బాగోలేదని వైద్యులు చెబుతోంటే భయమేస్తోందని అన్నారు. అయితే, తన భర్త పట్టుదల మాత్రం రోజు రోజుకు మరింతగా బలపడుతోందని, ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదని అన్నారు. ఆయనకు దేవుడు మరింత పోరాట శక్తిని అందించాలని తాను ప్రార్థిస్తున్నానని వ్యాఖ్యానించారు.

CM Ramesh
Andhra Pradesh
Kadapa District

More Telugu News