విమ్స్ ని ప్రైవేటీకరించేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడుతోంది: పవన్ కల్యాణ్ ఆరోపణ
విశాఖపట్టణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రి విమ్స్ లో ఈరోజు ఆయన పర్యటించారు. అక్కడి రోగులను పరామర్శించిన పవన్, వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర దోపిడీలో భాగంగా విమ్స్ ని ప్రైవేటీకరణ చేసేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆరోపించారు. ‘బొగ్గు, జబ్బులు మాకా? డబ్బులు వారికా?’అని విశాఖ జిల్లా పోర్ట్ కాలుష్య బాధితులు తనను అడిగిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు.