Renu Desai: ఆ ఏడుపుగొట్టు కథలు ఆపండి.. నేను నోరు విప్పితే బాగుండదు!: పవన్ అభిమానులకు రేణు దేశాయ్ వార్నింగ్

  • ఇన్నాళ్లూ నోరు విప్పనందుకు కృతజ్ఞతగా ఉండండి
  • నోరు విప్పితే అజ్ఞానులకు గర్వభంగం అవుతుంది
  • ఏడుపుగొట్టు కథలు ఆపండి
పవన్ కల్యాణ్ అభిమానులపై రేణు దేశాయ్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు తాను మౌనంగా ఉన్నానని, అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలని, మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. విడాకుల వ్యవహారంపై తాను కనుక నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని హెచ్చరించారు. విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన పవన్ అభిమానులకు గర్వభంగం అవుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

పవన్ అభిమానులకు మర్యాద తెలియదని, అవివేకులని దుయ్యబట్టారు. తనను ట్రోల్ చేయడం ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి ప్రవేశించి ఏడుపుగొట్టు కథలు చెప్పుకోవడం మానాలని వార్నింగ్ ఇచ్చారు.

వారి నెగిటవిటీని భరించాల్సిన అవసరం తనకు లేదని, అసలు తానేం చేశానని వాటిని భరించాలని రేణు దేశాయ్ ప్రశ్నించారు. దయచేసి సలహాలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. అభిమానుల మూర్ఖత్వానికి తెరపడి, తన గురించి, తన పని గురించి వచ్చే కామెంట్లను స్వేచ్ఛగా చదువుకునే రోజు రావాలని ప్రార్థిస్తున్నట్టు రేణు దేశాయ్ పేర్కొన్నారు.
Renu Desai
Pawan Kalyan
Janasena
Tollywood

More Telugu News