BSF: రైలులో వెళుతూ అదృశ్యమైన పదిమంది బీఎస్ఎఫ్ జవాన్లు!

  • జమ్ముకశ్మీర్ వెళుతుండగా ఘటన
  • రైల్వే పోలీసులకు ఫిర్యాదు
  • గాలిస్తున్న పోలీసులు
రైలులో వెళుతున్న జవాన్లలో పదిమంది అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మొత్తం 83 మంది జవాన్లతో పశ్చిమ బెంగాల్ నుంచి జమ్ముకశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌కు ప్రత్యేక రైలు బయలుదేరింది. మార్గమధ్యంలో జవాన్ల హాజరును తీసుకున్న అధికారులు అందులో పదిమంది అదృశ్యమైనట్టు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ కమాండర్.. ముఘల్‌సరాయ్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు నుంచి పదిమంది ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అదృశ్యమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న జవాన్ల కోసం గాలింపు చేపట్టారు.
BSF
Jawans
Jammu And Kashmir
West Bengal

More Telugu News