Minister pocharam: మంత్రి పోచారంకు కేటీఆర్ పరామర్శ

  • పోచారంకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
  • దీంతో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన కేటీఆర్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని మరో మంత్రి కేటీఆర్ ఈ రోజు పరామర్శించారు. నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో మంత్రి పోచారం మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలసి ఆస్పత్రికి వెళ్లి పోచారం శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి  పోచారం ఆస్పత్రిలో ఉన్నప్పటికీ తన బాధ్యతలను కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న రైతు బీమా విషయమై ఫోన్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేయడం గమనార్హం.
Minister pocharam
KTR

More Telugu News