joe jackson: మైఖేల్ జాక్సన్ తండ్రి జోయ్ జాక్సన్ కన్నుమూత!

  • 1928లో జన్మించిన జోయ్ జాక్సన్
  • పాంక్రియాటిక్ కేన్సర్ తో మృతి
  • శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ తండ్రి జోయ్ జాక్సన్ కన్నుమూశారు. పాంక్రియాటిక్ కేన్సర్ తో బాధపడుతూ, ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. జోయ్ మనవళ్లు రాండీ జాక్సన్ జూనియర్, టై జాక్సన్ లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మైఖేల్ జాక్సన్ తనయుడు ప్రిన్స్ మైఖేల్ జాక్సన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ, అంకిత భావానికి మారుపేరు మా తాత అని చెప్పారు. కుటుంబం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని తెలిపారు. జోయ్ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

1928 జూలై 26న జోయ్ అమెరికాలోని అర్కాన్సస్ లో జన్మించారు. ఆయనకు 11 మంది సంతానం. మైఖేల్ జాక్సన్ 8వ సంతానం. చిన్నతనంలోనే పిల్లల్లో ఉన్న మ్యూజిక్ ట్యాలెంట్ ను గుర్తించి, వారిని ప్రోత్సహించాడు. అందరికీ మేనేజర్ గా వ్యవహరిస్తూ, మంచిచెడ్డలు చూసుకున్నారు. తన తండ్రి క్రమశిక్షణే తమ ఎదుగుదలకు కారణమని పలు సందర్భాల్లో మైఖేల్ జాక్సన్ చెప్పారు. కాగా, మైఖేల్ జాక్సన్ 2009లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
joe jackson
dead
michael jackson

More Telugu News