Chandrababu: ప్రత్యేక విమానంలో శ్రీకాకుళం బయల్దేరిన చంద్రబాబు

  • ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
  • జగ్గుశాస్త్రులపేటలో చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
  • కాసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి పయనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక విమానంలో ఆయన వెళ్లారు. విశాఖ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ఆముదాలవలస మండలం పార్వతీశంపేటలో ఆయన దిగుతారు. అనంతరం రోడ్డు మార్గంలో రావికంటపేట గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం జగ్గుశాస్త్రులపేటలోని ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంకు చేరుకుని... చంద్రన్న రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తారు.
Chandrababu
Srikakulam District

More Telugu News