kcr: కేసీఆర్ విజయవాడ పర్యటన సందర్భంగా భారీ భద్రత.. షెడ్యూల్ వివరాలు!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్తున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దుర్గ గుడిలో కేసీఆర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారిక భద్రత, ప్రొటోకాల్ సిబ్బంది ఉదయాన్నే గుడికి చేరుకున్నారు.

కేసీఆర్ షెడ్యూల్ వివరాలు!

మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రభుత్వ వెటర్నరీ కళాశాల గెస్ట్ హౌస్ కు బయల్దేరుతారు. పది నిమిషాల పాటు అక్కడ సేద తీరుతారు. అనంతరం దుర్గ గుడికి వెళతారు. 40 నిమిషాల పాటు గుడిలో ఉంటారు. పూజలు, మొక్కులు చెల్లించుకున్న అనంతరం గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. పది నిమిషాల విశ్రాంతి అనంతరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 2.20 గంటలకు హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.
Go Back to Shorts
kcr
Vijayawada

More Telugu News