Kadapa District: ఉక్కు దీక్ష ప్రారంభం అయ్యాక మరో 2 కొత్త కొర్రీలు వేశారు: చంద్రబాబు

  • మొన్నటివరకు బయ్యారం ప్లాంట్‌ పై స్పష్టతలేదన్నారు
  • బయ్యారం భూములు, నీళ్ల వివరాలు రాలేదన్నారు
  • ఇప్పుడు ఏపీపై అభ్యంతరాలు చెబుతున్నారు
  • కడపలో ఏపీ ఇచ్చే భూములపై ఎటువంటి వివాదం లేదు
కడపలో ఉక్కు కర్మాగారం పూర్తి చేసేందుకు రెండేళ్లు పడుతుందని, ఉక్కు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర మంత్రులు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని, ఉక్కు దీక్ష ప్రారంభం అయ్యాక మరో రెండు కొత్త కొర్రీలు వేశారని అన్నారు.

ఈరోజు ఆయన తమ నేతలతో మాట్లాడుతూ... మొన్నటివరకు తెలంగాణలో నిర్మించనున్న ప్లాంట్‌ పై స్పష్టతలేదన్నారని, బయ్యారం భూములు, నీళ్ల వివరాలు రాలేదన్నారని చెప్పారు. ఇప్పుడు ఏపీపై అభ్యంతరాలు చెబుతున్నారని అన్నారు. కడపలో ఏపీ ఇచ్చే భూములపై ఎటువంటి వివాదం లేదని చంద్రబాబు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కేంద్ర సర్కారు తాత్సారం చేస్తోందని ఆరోపించారు. 
Kadapa District
Chandrababu
Telugudesam

More Telugu News