uma bharathi: మరికొన్నాళ్లు ఎదురు చూసేంత ఓర్పు నాకు లేదు: రామమందిర నిర్మాణంపై కేంద్రమంత్రి ఉమా భారతి

  • తీవ్ర చర్చనీయాంశమవుతోన్న రామ మందిర నిర్మాణం
  • ఆ మందిర నిర్మాణం జాతి గర్వించదగ్గ విషయమన్న ఉమాభారతి
  • వీలైనంత తొందరగా నిర్మించండని వ్యాఖ్య
అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కచ్చితంగా రామమందిర నిర్మాణం జరుగుతుందని ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేసిన విషయం విదితమే. తాజాగా కేంద్ర మంత్రి ఉమాభారతి ఇదే విషయంపై మాట్లాడుతూ... అయోధ్యలో రామ మందిర నిర్మాణం జాతి గర్వించదగ్గ విషయమని, మరికొన్నాళ్లు ఎదురు చూసేంత ఓర్పు తనకు లేదని అన్నారు.

వీలైనంత తొందరగా నిర్మించండని ఉమా భారతి వ్యాఖ్యానించారు. రామ భక్తులు, స్వయం సేవకులు రామాలయ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం కన్నా రామ మందిర నిర్మాణ సంకల్పం గొప్పని ఆమె వ్యాఖ్యానించారు.
uma bharathi
Uttar Pradesh
Narendra Modi

More Telugu News