kiran kumar reddy: మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్‌ ఎంపీ సుబ్బరామిరెడ్డి

  • అర్ధగంటపాటు చర్చించిన నేతలు
  • కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక దాదాపు ఖాయం
  • త్వరలోనే పార్టీ అధిష్ఠానాన్ని కలుస్తారన్న సుబ్బరామిరెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆయనను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీ సుబ్బరామిరెడ్డి కలిశారు. సుమారు అర్ధగంట పాటు వారు చర్చించారు. అనంతరం సుబ్బరామి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైందని అన్నారు. ఆయన త్వరలోనే తమ పార్టీ అధిష్ఠానాన్ని కలుస్తారని, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు పార్టీలో సముచితస్థానం ఉంటుందని వ్యాఖ్యానించారు.       
kiran kumar reddy
subbarami reddy
Congress

More Telugu News