Balakrishna: నరసింహస్వామి ఆలయంలో చంద్రబాబు పేరిట అర్చన చేయించిన బాలకృష్ణ

  • చిలమత్తూరు మండల పర్యటనలో బాలయ్య
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • సోమఘట్ట లక్ష్మీనరసింహస్వామికి పూజలు
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిలమత్తూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా సోమఘట్ట గ్రామంలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేరున అర్చన చేయించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలయ్య వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తరలి వచ్చారు. తన పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మరోవైపు, గత కొంత కాలంగా నియోజకవర్గంలోని పార్టీ కార్యకలాపాలపై బాలయ్య పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మండలాల వారీగా నేతలు, కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అలసత్వం ప్రదర్శిస్తున్న నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 
Balakrishna
Chandrababu

More Telugu News