'సుధీర్ ప్రపోజ్ చేశాడు కదా?' అని అడిగిన అభిమానులు.. రష్మీ చెప్పిన సమాధానాలకు నెటిజన్ల షాక్
- 'సుధీర్ మీకు ప్రపోజ్ చేశారు కదా?
- ఎందుకు సమాధానం చెప్పలేదు?
- 'అది నా ఇష్టం' అని పేర్కొన్న రష్మీ
తాజాగా అభిమానులు సుధీర్ గురించి ఆమెను ప్రశ్నించారు. 'సుధీర్ మీకు ప్రపోజ్ చేశారు కదా? ఎందుకు అప్పుడు సమాధానం చెప్పలేదు?' అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి రష్మీ సమాధానం చెబుతూ.. 'అది నా ఇష్టం' అని పేర్కొని షాక్ ఇచ్చింది. 'ప్రోగ్రాంలో ప్రపోజ్ చేశాడు కదా.. అలా అడిగినందుకు క్షమించండి?' అని మళ్లీ ఓ కామెంట్ చేయగా, 'మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది.. ‘ప్రోగ్రామ్లో’ అంటే తెరపైన అని' అని ఆమె సమాధానం ఇచ్చింది.
మరో అభిమాని 'సుధీర్ నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాడు?' అని అడగగా 'ఆయన మీకు చెప్పారా?' అంటూ రష్మీ ప్రశ్నించింది. ఒక నెటిజన్ 'రష్మి నీ పెళ్లెప్పుడు? అని అడగగా 'నా పెళ్లి ఖర్చు మీరు పెట్టబోతున్నారా?' అని ఆమె ఎదురు ప్రశ్నించింది. 'సినిమాల్లో మీరు కనిపించడం లేదు ఎందుకని?' అని ఒకరు ప్రశ్నించగా.. 'చేయట్లేదు కాబట్టి' అని రష్మీ చెప్పింది. 'సినిమాల్లో మీరు నటించడం లేదా? లేక తీసుకోవడం లేదా?' అని ఓ నెటిజన్ అడగగా ఆమె 'తీసుకోవడం లేదు' అంటూ సూటిగా చెప్పేసింది. ముక్కు సూటిగా ఆమె చెప్పిన సమాధానాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.