పోలీసులు వేధిస్తున్నారంటూ.. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే!
- సొంత పార్టీ నేత వల్ల కష్టాలు వస్తున్నాయని ఆరోపణ
- బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ
- ఓదార్చిన అధికార, విపక్ష నేతలు
తనకు భద్రత కల్పించాలని స్పీకర్‌కు ఆమె విన్నవించింది. కాగా, ఆమెకు అండగా నిలచిన విపక్ష నేతలు అధికార పార్టీ ఎమ్మెల్యేకే భద్రత లేదని, ఇక సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందని విమర్శలు చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ఈరోజు శాసనసభలో జీరో అవర్‌లో ఈ పరిస్థితి నెలకొంది. సభలోనే కన్నీరు మున్నీరైన ఆమెను కాంగ్రెస్, బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓదార్చారు. రివా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నీలిమ.. సిమరియా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.