Nara Lokesh: ఉక్కు పరిశ్రమపై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదు.. ఇది వారి వైఖరిని బయటపెడుతోంది: లోకేశ్‌

  • కడప ఉక్కు ఆంధ్రుల హక్కు
  • పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలి
  • ఎంపీ సీఎం రమేష్ చేస్తోన్న దీక్ష ఏడవ రోజుకి చేరుకుంది
  • బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
తమ ఎంపీ సీఎం రమేష్‌ చేస్తోన్న ఆమరణ నిరాహార దీక్షపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. తాజాగా ఆయన ట్వీట్‌ చేస్తూ... "కడప ఉక్కు ఆంధ్రుల హక్కు.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎంపీ సీఎం రమేష్ చేస్తోన్న దీక్ష ఏడవ రోజుకి చేరుకుంది. అయినా కేంద్రం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం ఆంధ్రుల పట్ల బీజేపీ నేతల వైఖరిని మరోసారి బయటపెడుతోంది.  

బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతియ్యడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చెయ్యకుండా హామీల అమలు కోసం ఢిల్లీలో యాత్రలు చేస్తే బాగుంటుంది" అని పేర్కొన్నారు. 
Nara Lokesh
Andhra Pradesh
Telugudesam

More Telugu News