Mahesh Babu: మహేశ్ 25వ మూవీ కోసం ఐటమ్ సాంగ్ కి ట్యూన్ రెడీ!

  • షూటింగు దశలో మహేశ్ మూవీ 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్  
ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగు కోసం 'డెహ్రాడూన్'లో వున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. 'పోకిరి' నుంచి కూడా మహేశ్ బాబు సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కి ఆడియన్స్ లో క్రేజ్ పెరుగుతూ వస్తోంది. అందువలన ఈ సినిమా కోసం కూడా ఒక ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

 దర్శక నిర్మాతలు మహేశ్ బాబుతో మాట్లాడి .. ఈ విషయాన్ని దేవిశ్రీ ప్రసాద్ కి చెప్పారట. ఆయన తనదైన స్టైల్లో యూత్ ను .. మాస్ ను ఒక రేంజ్ లో పట్టుకునే ఐటమ్ సాంగ్ కి ట్యూన్ సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఇప్పటివరకూ మహేశ్ సినిమాల్లోని మాస్ మసాలా ఐటమ్ సాంగ్ కి మించినదిగా ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. స్టార్ హీరోయిన్ పైనే ఈ ఐటమ్ సాంగ్ ను చేయాలనే ఉద్దేశంతో, కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారట. చూడాలి మరి ఈ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో.  
Mahesh Babu
pooja hegde

More Telugu News