Tirumala: పగిలిన రూబీ విలువ రూ.50గా రికార్డుల్లో ఉంది: టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్

  • శ్రీవారి ఆభరణాలున్న గది తాళాలు ముగ్గురి వద్ద ఉంటాయి
  • సీక్రెట్ లాక్ వల్ల పూర్తి స్థాయి భద్రత ఉంటుంది
  • రమణదీక్షితులుకు శ్రీవారే తగిన శాస్తి చేస్తారు
తిరుమల శ్రీవారి ఆభరణాల్లోని రూబీ ఒకటి పగిలిపోయిందని, దాని విలువ రూ. 50గా రికార్డులో నమోదు చేసి ఉందని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ చెప్పారు. శ్రీవారి ఆభరణాలను టీటీడీ పాలక మండలి సభ్యులు ఈరోజు పరిశీలించారు. 

అనంతరం, మీడియాతో చైర్మన్ మాట్లాడుతూ, శ్రీవారి ఆభరణాలు భద్రపరిచిన గది తాళాలు ముగ్గురి వద్ద ఉంటాయని, సీక్రెట్ లాక్ వల్ల పూర్తి స్థాయి భద్రత ఉంటుందని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న రమణదీక్షితులుకు శ్రీవారే తగిన శాస్తి చేస్తారని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకే రమణదీక్షితులు ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలు నిజమైతే తిరుమలకు వచ్చి నిరూపించాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tirumala
ttd chairman

More Telugu News