laskere: భారత్ లోకి చొరబడ్డ లష్కరే ఉగ్రవాదులు.. కేంద్ర నిఘా విభాగం హెచ్చరిక
- కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఉన్నత స్థాయి కీలక సమావేశం
- ఐఎస్ఐ సహకారంతో భారత్ లోకి చొరబడ్డ 20 మంది ఉగ్రవాదులు
- అమర్ నాథ్ యాత్రపై దాడి లక్ష్యంగా చొరబడ్డారన్న ఐబీ
లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇరవై మంది భారత్ లోకి చొరబడినట్టు కేంద్ర నిఘా విభాగం (ఐబీ) వెల్లడించింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఉన్నత స్థాయి కీలక సమావేశం అనంతరం ఐబీ కొంత సమాచారాన్ని బయటకు వెల్లడించింది. ఐఎస్ఐ సహకారంతో ‘లష్కరే’కు చెందిన 20 మంది ఉగ్రవాదులు పీవోకే నుంచి రెండు బృందాలుగా భారత్ లోకి చొరబడినట్టు తమకు సమాచారం అందిందని పేర్కొంది.
భారత్ లోకి వచ్చిన తొలి బృందంలో పదకొండు నుంచి పదమూడు మంది ఉగ్రవాదులు, రెండో బృందంలో ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది. అమర్ నాథ్ యాత్రకు కీలకమైన కంగన్ ప్రాంతంలో దాడి చేయాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించినట్టు తమ వద్ద సమాచారం ఉందని, ఈ నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.