యాదాద్రి సమీపంలో ఘోరం... ట్రాక్టర్ మూసీ నదిలో పడి 14 మంది దుర్మరణం!
- ట్రాక్టర్ లో 30 మంది కూలీలు
- 19 మంది మహిళలు, 11 మంది పురుషులు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు
డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తుండగా, మొత్తం 30 మంది కూలీలుండగా, అందులో 19 మంది మహిళా కూలీలే. ట్రాక్టర్ నదిలో పడుతున్న సమయంలో అందులోని పురుషులంతా బయటకు రాగా, మహిళలు రాలేకపోయారని సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.