Kamal Haasan: సోనియా గాంధీతో భేటీ అయిన కమలహాసన్

  • పొత్తుపై చర్చించలేదన్న కమల్
  • తమిళ రాజకీయాలపైనే చర్చ
  • కేజ్రీవాల్ తో ఫోన్లో మాట్లాడతానన్న విలక్షణ నటుడు
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీతో విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ భేటీ అయ్యారు. తన రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఢిల్లీలో ఉన్న కమల్... నిన్న రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే సోనియాను కలిశానని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా... తమ మధ్య పొత్తుకు సంబంధించిన చర్చ రాలేదని స్పష్టం చేశారు. దీని గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు అవుతుందని చెప్పారు. తమిళనాడు రాజకీయాల గురించే మాట్లాడామని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను తాను కలవడం లేదని చెప్పారు. బెంగళూరులో 10 రోజుల పాటు ఆయన నేచురోపతి ట్రీట్ మెంట్ కోసం వెళతారన్నారని, అందువల్ల ఆయనను కలవడం వీలు కాదని తెలిపారు. కేజ్రీవాల్ ఢిల్లీలోనే ఉన్నారని మీడియా ప్రతినిధులు చెప్పగా... అయితే, ఫోన్ చేసి మాట్లాడతానని అన్నారు. 
Kamal Haasan
Sonia Gandhi
Arvind Kejriwal

More Telugu News