paruchuri gopalakrishna: ఆ ఒక్క డైలాగ్ తో కృష్ణగారు వరుస అవకాశాలు ఇచ్చారు: పరుచూరి గోపాలకృష్ణ

  • దర్శకులు పీసీ రెడ్డి గారు డైలాగ్స్ రాయించారు 
  • అవి కృష్ణగారికి బాగా నచ్చాయి 
  • లేదంటే మా జీవితం ఏ వైపు వెళ్లేదో  
తెలుగు సినీ రచయితల్లో పరుచూరి గోపాలకృష్ణ స్థానం ప్రత్యేకం. తాజాగా ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ తమ కెరియర్ తొలినాళ్లను గురించి ప్రస్తావించారు. "దర్శకుడు పీసీ రెడ్డి గారు అప్పుడు కృష్ణ .. శ్రీదేవి కాంబినేషన్లో 'బంగారు భూమి' సినిమా చేస్తున్నారు. మరుసటి ఉదయం షూటింగుకి సీన్స్ లేవు అంటే .. ఆ రాత్రంతా కూర్చుని 16 సీన్స్ రాశాను. ఆ సినిమా కథా చర్చల్లోను నేను కూర్చోవడం వలన నా పని తేలికైంది.

ఆ సినిమాలో ఒక సందర్భంలో కృష్ణగారు "పద్మా .. మనిషిని నమ్మితే మన నోట్లో మట్టిగొడతాడు .. మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది" అనే డైలాగ్ చెబుతారు. ఆ ఒక్క డైలాగ్ నచ్చడంతో కృష్ణగారు మాకు ఏడెనిమిది సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాలు మాకు రావడానికి కారకులు 'బంగారుభూమి' సినిమాతో మాకు ఛాన్స్ ఇచ్చిన పీసీ రెడ్డి గారు. ఆ రోజున ఆయన మాతో ఆ సినిమాకి డైలాగ్స్ రాయించి వుండకపోతే .. ఆ డైలాగ్స్ కృష్ణగారి వరకూ వెళ్లకపోతే .. మా జీవితం ఏ వైపు వెళ్లేదో తెలియదు" అంటూ చెప్పుకొచ్చారు.   
paruchuri gopalakrishna
krishna

More Telugu News