somu veerraju: సోము వీర్రాజు ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు యత్నించిన ఆందోళనకారులు

  • విశాఖలో సోము వీర్రాజు ప్రెస్ మీట్
  • బీజేపీకి, వీర్రాజుకు వ్యతిరేకంగా ఆందోళనకారుల నిరసన
  • ఏపీకి అన్యాయం చేస్తున్నారంటూ మండిపాటు
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఊహించని నిరసన ఎదురైంది. విశాఖపట్నంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు ఆందోళనకు దిగారు. ప్రెస్ మీట్ జరగకుండా అడ్డుకున్నారు. ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని...  రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. సోము వీర్రాజుకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత సోము వీర్రాజు ప్రెస్ మీట్ కొనసాగింది. 
somu veerraju
BJP

More Telugu News