Mahesh Babu: మహేశ్ 25వ మూవీలో ఆయన న్యూ లుక్ ఇదిగో!

  • వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు 
  • డెహ్రాడూన్ లో జరుగుతోన్న షూటింగ్
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  
ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మహేశ్ బాబు కెరియర్లో ఇది 25వ సినిమా. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ 'డెహ్రాడూన్'లో మొదలైంది. మహేశ్ బాబు తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు కొత్తలుక్ తో కనిపించనున్నాడనే టాక్ వచ్చిన దగ్గర నుంచి, ఆయనని ఆ లుక్ తో చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు.

తాజాగా ఆయన లొకేషన్లో వున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. రఫ్ హెయిర్ స్టైల్ తో .. సన్నని మీసకట్టుతో .. లైట్ గా పెరిగిన గెడ్డంతో .. హాఫ్ హాండ్స్ షర్ట్ తో మహేశ్ బాబు కనిపిస్తున్నాడు. ఈ లుక్ తో నిజంగానే ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.  
Mahesh Babu
pooja hegde

More Telugu News