'గవర్నర్ నుంచి ఫోన్' అనగానే ఆశ్చర్యపోయిన మెహబూబా ముఫ్తీ!
- పీడీపీ - బీజేపీ కటీఫ్
- మద్దతు ఉపసంహరణ విషయాన్ని స్వయంగా తెలిపిన గవర్నర్
- డైరెక్టుగా గవర్నర్ కే సమాచారం ఇచ్చిన బీజేపీ
సాధారణంగా మద్దతు ఉపసంహరించుకునే పార్టీ తొలుత భాగస్వామ్య పార్టీకి చెబుతుంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కవీందర్ గుప్తా, మద్దతు ఉపసంహరణపై మెహబూబాకు సమాచారం ఇవ్వకుండా ఉండటం, గవర్నరే స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఆశ్చర్యానికి గురైన ఆమె, ఆ వెంటనే తేరుకుని, తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గవర్నర్ కార్యాలయానికి వెళ్లి తన రాజీనామాను సమర్పించి వచ్చారు.